CTR: విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లంటూ ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు డీఈవో రాజేంద్రప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు చిత్తూరు ప్రధాన కూడళ్లలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయని ఫిర్యాదు చేశారు.