SRPT: సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లా ఎస్పీ నరసింహ నిరసనకారులకు హెచ్చరికలు జారీ చేశారు. సమ్మె పేరుతో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు లేదా బస్సు యజమానులను బెదిరించినా, దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.