SRD: ఖేడ్ మండలం అబ్బెందకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు CH విఠల్ తెలుగు సాహిత్యంలో రుద్రమదేవి అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ‘డాక్టరేట్’ పట్టాను పొందారు. ప్రస్తుతం కోహీర్ మండలం గురుజువాడ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో బోధన చేస్తూనే ఉన్నత విద్య చదివి డాక్టరేట్ పొందడం విశేషం.