ADB: ఇంద్రవెల్లి మండలం ఏమాయకుంటలో నూతనంగా నిర్మించిన జ్వాలాముఖి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరు కావాలని జిల్లా ఎస్పీ అఖిలేష్ మహాజన్ను నిర్వాహకులు కోరారు. సురేష్ మహారాజ్ బృందం ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 23న జరిగే కార్యక్రమ ఏర్పాట్లను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా వస్తానని వారికి ఎస్సీ హామీ ఇచ్చారు.