WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో శనివారం రాత్రి హిందూ ధర్మ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఖాదీ & చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ సంప్రదాయాలు, సంస్కృతి, వేద విజ్ఞానాన్ని యువతలోకి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. పురాణాలు, సంప్రదాయాలను అనుసరించడం ద్వారా సమాజంలో శాంతి, ఐక్యత నెలకొంటుంది అన్నారు.