PLD: వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీవోఏల పాత్ర ఎంతో కీలకమన్నారు. వారి పనితీరును మరింత మెరుగుపరచడం, డిజిటల్ సేవలను వేగవంతం చేయడానికే ప్రభుత్వం ఈ మొబైల్స్ ఇస్తోందని ఆయన వివరించారు.