AKP: రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామంలో శనివారం కలెక్టర్ విజయకృష్ణన్ స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మట్టి మోసారు. ఈ వారం నీటి సంరక్షణపై దృష్టి సారించినట్లు తెలిపారు. భూగర్భ జలాల పెంపుకు అవసరమైన పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని ఆదేశించారు. నీరు భూమిలో ఇంకే విధంగా చెక్ డ్యామ్ లు, ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు.