NRML: కుంటాల మండలంలోని విటాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఈ నేపథ్యంలో ఇవాళ కుంటాల మాజీ ఎంపీపీ రమణారావు గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.