కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా జల ధార-జల హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, గ్రామ పెద్దలు ప్రతిజ్ఞ చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టు వద్ద జల హారతి చేపట్టారు. చెరువు గట్టు పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించారు.