రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-స్వఛ్చాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో మూడో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల పరిసరాలను శుభ్రపరిచారు. చెత్త తొలగించి, పిచ్చిమొక్కలు తొలగించారు. పరిశుభ్రతతో ఆరోగ్యం సాధ్యమని తెలిపారు.