ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ భారీ మార్పులకు సిద్ధమైంది. ఈ ఏడాది మే నుంచి మూవీ, కాన్సర్ట్ టికెట్ బుకింగ్ రంగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది. దీంతో టికెట్ల అమ్మకాల్లో బుక్మైషోకు గట్టి పోటీనివ్వనుంది. త్వరలో ఫుడ్ డెలివరీ కూడా ప్రారంభించనుంది. IPO కోసం సిద్ధమవుతూ, ప్రధాన కార్యాలయాన్ని ఇప్పటికే సింగపూర్ నుంచి భారత్కు మార్చింది.