NZB: వేల్పూర్ మండలం మోతెలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కు శనివారం వినతిపత్రం అందజేశారు. అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొల్ల రమేష్, ఉప సర్పంచ్ పరంజ్యోతి కుమార్, దామా సాయన్న, కుమ్మరి రవి తదితరులు పాల్గొన్నారు.