VSP: ఏయూ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాయాచిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. శతాబ్ధి చరిత్రను ప్రతిబింబించే ఫోటోలతో విశ్వవిద్యాలయ వికాసం, క్యాంపస్ అందాలను విద్యార్థులు కళాత్మకంగా ప్రదర్శించారు. టి.ఎల్.ఎన్ సభామందిరంలో నిర్వహించిన ఈ ప్రదర్శనను నగర విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తిలకించారు. కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.