SRD: జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటికే ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్లొడ్ చేసుకున్నారని, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.