KMM: ఖమ్మంలో వానకాలం సాగుకు సంబంధించి విత్తనాల సరఫరాపై శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకుని 30 వేల క్వింటాళ్ల విత్తనాల సరఫరా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.