MNCL: చెన్నూర్ మండలంలోని సోమనపల్లి గ్రామంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మాణ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జూనియర్, సీనియర్ విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహాలు, రోడ్లు, విద్యుత్ సరఫరా, ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.