IPLకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి చూపుతోంది. టోర్నీ మొత్తానికి కాకుండా, ఒక మ్యాచ్‌ను ఆడిలైడ్‌లో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే BBL ఆరంభ మ్యాచ్ చెన్నైలో జరగనున్న నేపథ్యంలో, అదే తరహాలో IPL మ్యాచ్‌ను తమ దేశంలో నిర్వహించాలని ఆసీస్ భావిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, రెండు బోర్డులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.