PDPL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పెద్దపల్లిలో ఆదివారం డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO డా. ప్రమోద్ కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలు వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ప్రతినిధులు, ఫార్మసీ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.