‘బైకర్’ మూవీలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా విజయంపై సక్సెస్ మీట్లో ఆయన స్పందిస్తూ.. శర్వానంద్‌తో కలిసి పనిచేయడం, దర్శకుడు అభిలాష్ రెడ్డి రాసిన గొప్ప పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నాడు. ఈ విజయానికి దర్శకుడే ప్రధాన కారణమని కొనియాడాడు. ఇదిలా ఉండగా, రాజశేఖర్ నటన సినిమాకు పెద్ద ప్లస్ అయ్యిందని చిత్ర యూనిట్ తెలిపింది.