AP: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి సస్పెన్షన్కు గురయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆమెపై ఫిర్యాదులు రావడంతో ఈనెల 7న ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. అక్రమ ఆస్తుల కేసులో శాంతిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈనెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.