KMM: ముడిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన తాళ్ల సందీప్ (22), వృత్తిరీత్యా మెకానిక్, కొంతకాలంగా మానసిక స్థితి బాగోలేక కడుపు నొప్పి రావడంతో ఆవేశానికి లోనై గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఖమ్మంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చివరకు మంగళవారం తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.