జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్ అని మాజీ ఎంపీ భరత్ తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తి రెడ్‌బుక్ పేరుతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా? అని ప్రశ్నించారు. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమేనని ఎద్దేవా చేశారు. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు? అని అడిగారు.