MDK: 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో అండర్-14 సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణ బాలికల జట్టులో తూప్రాన్ గురుకుల విద్యార్థినులు చోటు దక్కించుకున్నట్లు ప్రిన్సిపాల్ అనురాధ తెలిపారు. మహబూబాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సింధుజ, ప్రసన్న ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. వీరిని పలువురు అభినందించారు.