IPLలో స్లో ఓవర్ రేట్ సమస్యపై మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్లో ఓవర్ రేట్ నమోదైనప్పుడు కెప్టెన్లకు జరిమానా విధిస్తారు. అయితే, ఆట ఆలస్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అంపైర్లదేనని, మ్యాచ్ నెమ్మదిగా సాగుతుంటే ఆటగాళ్లకు కాకుండా అంపైర్లకే జరిమానా విధించాలని అతడు సూచించాడు. నిబంధనలను వారు కఠినంగా అమలు చేయడం లేదని విమర్శించారు.