ఆర్థిక ఇబ్బందులు ఒక తరం నుండి మరో తరానికి సోకే వైరస్ లాంటివని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ జీతాలు వచ్చినా చాలా కుటుంబాల పరిస్థితి మారకపోవడానికి కారణం సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే. సంపద సృష్టించాలంటే అనవసర ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సభ్యుల్లో చిన్నతనం నుండే పొదుపు అలవాట్లను పెంచాలని, అప్పులకు స్వస్తి పలికి పెట్టుబడుల వైపు అడుగులు వేయాలని చెబుతున్నారు.