VKB: మిట్టకోడూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతకు తోడు వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటల వేడికి విద్యుత్ తీగలు కాలిపోవడంతో గ్రామంలో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది.