ముంబైలో జరిగిన ‘సుజుకి మాట్సురి 2026’ ఈవెంట్లో బర్గ్మన్ 400 మ్యాక్సీ స్కూటర్ భారత మార్కెట్లో మెరిసింది. 400cc పవర్ఫుల్ ఇంజిన్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఇది రూపొందింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ భారత్లో BMW C400 GT వంటి లగ్జరీ స్కూటర్లకు గట్టి పోటీ కానుంది.