SRD: నారాయణఖేడ్ పట్టణంలోని 6వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కార్ బుధవారం పూజ చేసి పనులు ప్రారంభించారు. స్థానిక లబ్ధిదారు లతీఫ్ సుల్తానా సొంత స్థలంలో ఇల్లు నిర్మించెందుకు, అధికారులు ఇంటి కొలతల ముగ్గు వేశారు. చైర్మన్ మాట్లాడుతూ.. సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు.