ఎయిరిండియా సంస్థకు 2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి దాదాపు రూ.22,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీంతో వాటాదారులైన టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను ఎయిరిండియా ఆర్థిక సాయం కోరినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, పశ్చిమాసియాలో యుద్ధం తమ నష్టాలకు కారణమని కంపెనీ తెలిపింది. గతంలో 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేసినప్పటికీ భారీగా పెరిగింది.