సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు యాప్ ఓపెన్ చేయగానే ‘పాకెట్‌మనీ’ అనే సింబల్ కనిపిస్తోంది. దాన్ని నొక్కితే ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయట. డిజిటల్ పేమెంట్ చేసే వారంతా తమకు అవసరం లేని యాప్, లింకుల జోలికి వెళ్లక పోవడమే మంచిదని పోలీసు అధికారులు ప్రచారం చేస్తున్నారు.