రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పరాజయం పొందింది. 147 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు.. 15.1 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 149 రన్స్ చేసి విజయం సాధించింది. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ 49, రజత్ పాటిదార్ 27 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.