AP: కోటి మంది టీడీపీ కుటుంబసభ్యులను ఒక సైన్యంలా మంత్రి లోకేష్ తయారు చేశారని మంత్రి పార్థసారథి తెలిపారు. పసుపు జెండాలను మోసే పసుపు సైనికులకు బీమా అనే ధీమా ఇచ్చారని కొనియాడారు. పార్టీ బలోపేతానికి, సమర్ధవంతమైన పాలనకు లోకేష్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరిన్ని కీలకమైన మైలు రాళ్లను చేరుకునేలా పనిచేస్తారని పేర్కొన్నారు.