AP: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రపంచస్థాయి మెకానిజం తీసుకురానున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి గ్రోత్ కారిడార్ల పరిధిలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అలాగే, రాయలసీమను త్వరలోనే స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని లోకేష్ స్పష్టం చేశారు.