AP: రాష్ట్రంలో అన్యాయాలకు జువ్వలదిన్నె హార్బర్ ఉదాహరణ అని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘వైసీపీ మళ్లీ వచ్చి ఉంటే మత్స్యకారులకు మెకనైజ్డ్ బోట్లు అందేవి. మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. కళ్లు మూసి తెరిచేలోపు 3 ఏళ్లు గడుస్తాయి.. వచ్చేది వైసీపీనే. బీద సోదరులు, అనుచరులు కుట్ర పన్నారు. వారి మధ్య కాల్ డేటా కనిపిస్తుంటే ఒక్కరైన అరెస్ట్ చేశారా?’ అని ప్రశ్నించారు.