బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త. మూఢనమ్మకాలపై యుద్ధం ప్రకటించిన కలియుగ యోధుడు కందుకూరి వీరేశలింగం పంతులు. స్త్రీ విద్యకు మద్ధతు ఇచ్చి, వితంతు పునర్వివాహాలను సమర్థిస్తూ తెలుగు సమాజంలో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన దార్శనికత ఆధునిక భారతీయ సమాజానికి ప్రగతిశీల ఆలోచనలకు పునాది వేసింది.