BDK: అశ్వాపురం మండలం, సీతారాంపురం గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామాలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కొత్త భవనం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు.