BPT: బల్లికురవ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థిని M. కుమారి 1000 మార్కులకు గాను 946 మార్కులు సాధించి కళాశాల పేరును మారుమోగించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ K. సుధాకర్, అధ్యాపక బృందం ఆమెను ఘనంగా అభినందించారు.