ASF: డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుండగా నోయిడా కార్మికులను అరెస్ట్ చేసి నిర్భంధించడాన్ని ఖండిస్తున్నట్లు CITU జిల్లా జాయింట్ సెక్రెటరీ క్రిష్ణమాచారి అన్నారు. శుక్రవారం సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని హమాలీ కార్మికుల అడ్డా పని ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల లాభాల కోసం కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు