BDK: అశ్వరావుపేట పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులను తక్షణమే చేపట్టి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రైతాంగానికి సాగునీరు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ కొత్తగూడెం జిల్లా సమితి సంయుక్త ఆధ్వర్యంలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వేలేరుపాడు వరకు చేపట్టిన పాదయాత్రను వారు ప్రారంభించి మాట్లాడారు.