TG: డిజిటల్ అరెస్ట్ పేరిట మోసాలకు పాల్పడుతున్న జగిత్యాలకు చెందిన అవినాష్ అనే నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా ఇలాంటి నేరాలకు పాల్పడుతూ సుమారు రూ.24L కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.12L నగదుతో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి సైబర్ మాయగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.