KDP: ప్రతి బిడ్డకు విద్య – మన అందరి బాధ్యతని ఒంటిమిట్ట ఎంఈవో -2 డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య అన్నారు. ఇవాళ తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏప్రిల్ 17- 23 వరకు ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. గ్రామంలోకి వెళ్లి ప్రభుత్వ పాఠశాల పట్ల మోటివేషన్ కల్పించాలన్నారు.