ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పార్లమెంట్ లాబీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఆప్తమిత్రులు రేవంత్ రెడ్డితో పాటు MP వేమ్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రను కూడా కలుసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేందర్ రెడ్డికి పయ్యావుల శుభాకాంక్షలు తెలియజేశారు.