KMM: జిల్లాలో ఈనెల 19న బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొంటారని ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు హరీష్ రావు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. BRS శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు.