PLD: అచ్చంపేటలో బీజేపీ నాయకుడు దేశెట్టి అనంత నాయుడు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడానికి ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక మనస్తత్వమే కారణమని ఆయన ఆరోపించారు. మహిళా సాధికారతకు అడ్డుపడటం తగదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.