కృష్ణా: గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో శనివారం జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పారిశుద్ధ్య పనుల్లో భాగస్వాములయ్యారు.