VZM: ఎల్ .కోట మండలం, సంతపేట గ్రామంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఆమె స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని, పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామాలను స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రజలందరూ బాధ్యతగా సహకరించాలన్నారు.