TG: హైదరాబాద్లోని పాన్ షాపుల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పాన్ షాపుల్లో విక్రయించే వస్తువుల నాణ్యతను పరిశీలించారు. ఓల్డ్ సిటీలోని పాన్ షాపుల్లో అమ్మే సిగరెట్లు, పాన్ మసాలాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా? లేదా? అని ఆరా తీశారు. బ్రాండెడ్ వాటినే అమ్ముతున్నారా?.. కల్తీవి అమ్ముతున్నారా? అనే తనిఖీ చేశారు. అయితే కొన్ని చోట్ల ఈ-సిగరెట్లు, నిషేధిత పాన్ మసలాలను స్వాధీనం చేసుకున్నారు.