NGKL: వేసవి దృష్ట్యా ఉపాధి హామీ కూలీలు తగిన జాగ్రత్తలు పాటించాలని హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్ సూచించారు. పాలెంలో శనివారం కూలీలతో మాట్లాడూతూ.. మధ్యాహ్నం 11 గంటలకే పనులు ముగించుకోవాలని, నీరు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, ఎండ సమయంలో బయటకు రావద్దని హెచ్చరించారు.