హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కాసేపట్లో SRH, CSK మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మ్యాచ్ టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. ధోనీ ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతాడని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో భారీగా అభిమానులు స్టేడియానికి చేరుకుంటున్నారు. అయితే, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.