MBNR: ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న ఆటలు ఇక మీద సాగవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఇష్టానుసారంగా బిల్లులను పాస్ చేయించుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. BJP పద్ధతి మార్చుకోవాలన్నారు.